హన్సికతో పొల్చుకుంటున్న తాప్పీ

Prasad
తాప్సీ ఎదుర్కొంటున్న పరిస్థితిని మరే ఇతర హీరోయిన్ అనుభవించడం లేదంటే అతిశయోక్తి కాదు. వరసగా చాన్సులు వస్తున్న చెప్పుకోవడాని ఒక హిట్ లేని స్థితిలో తాప్సీ ఉంది. కొంత మంది హీరోయిన్లకు హిట్లు ఉన్నా వాళ్ళకు చాన్సులు లేవు. అయితే తాప్సీ పరిస్థతి ఇందుకు భిన్నం. అయితే తాప్సీ మాత్రం చాలా ధీమాగా ఉంది. అల్లు అర్జున్ తో పూరీ తెరకెక్కించే సినిమాలో తాప్సీ ఎనికైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఈ ముద్దగుమ్మ నమ్ముతుంది. అల్లు, పూరీ కలయికలో వచ్చిన దేశ ముదురుతో హన్సికకు మంచి గుర్తింపు వచ్చిందని, మళ్లీ వీరి కలయికలో వస్తున్న సినిమాతో తనకు హిట్ వస్తుందని తాప్సీ చాలా ధీమాగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: